నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
దాంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్ పై న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.