చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

కాగా ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేయగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తుది వాదనలు వినేందుకు తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే అప్పటివరకు ముందస్తు బెయిల్ ను పొడిగించింది.అదేవిధంగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై కూడా విచారించవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

భగీరథ్ బార్డర్ దాటకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి:కవిత