చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు తదుపరి విచారణను జనవరి 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

ఈ క్రమంలోనే చంద్రబాబుకు గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ కౌంటర్ వేయలేదని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీనిపై హరీశ్ సాల్వే మాట్లాడుతూ తాము కౌంటర్ దాఖలుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇంకా తీర్పు వెలువడని నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

హీరోయిన్ కీర్తి సురేష్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా.. ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!