చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లులో చోటు చేసుకున్న హింస కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
అయితే దీంతో పాటు విజయనగరం కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
కాగా ఇప్పటికే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలమ్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
అలాంటి మ్యూజిక్ కావాలంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రవిగారు వింటున్నారా?