చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మధ్యాహ్నం 12 గంటలకు విచారణ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగనుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు.అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
బాలయ్యకు పద్మభూషణ్…. శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్?