BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

కాగా ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది.

"""/" / అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టు( Supreme Court )లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కవిత పిటిషన్ టాగ్ అయి ఉన్న నేపథ్యంలో కేసుల స్టేటస్ వివరాలు ఇవ్వాలని సుప్రీం( Supreme Court ) ధర్మాసనం కోరింది.

ఈ క్రమంలోనే అన్ని కేసుల విచారణను ఒకేసారి చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

పుష్ప2 సాధించిన రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా.. ఈ రికార్డ్స్ సులువు కాదంటూ?