ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పై నేడు టీఎస్ హైకోర్టులో విచారణ
TeluguStop.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
పిటిషన్ పై ఇప్పటికే అవినాశ్ రెడ్డి, వైఎస్ సునీతారెడ్డి తరపు వాదనలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మొదటి సారిగా జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది.వివేకా మృతి వార్త బయటకు తెలియక ముందే జగన్ కు తెలుసని సీబీఐ తెలిపింది.
అయితే ఆ విషయాన్ని అవినాశ్ రెడ్డి ద్వారా తెలుసుకున్నారా లేదా అనేది తెలియాలని పేర్కొంది.
ఈ క్రమంలో సీబీఐ వాదనల తరువాత హైకోర్టు తీర్పును వెలువరించనుంది.
చెక్‌బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష