ఎమ్మెల్యే రాజాసింగ్‎పై పీడీ యాక్ట్ పిటిషన్ విచారణ వాయిదా

ఎమ్మెల్యే రాజాసింగ్‎పై పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఈ క్రమంలో రేపు మరోసారి రాజాసింగ్ తరపు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించనున్నారు.

గడిచిన పదేళ్లలో తెలంగాణ హైకోర్టులో అనేక మందిపై నమోదైన పీడీ యాక్ట్ కేసులను కొట్టివేసిందని తెలిపారు.

అంతేకాకుండా పీడీ యాక్ట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను లాయర్ రవిచందర్ ప్రస్తావించారు.

రాజకీయ కక్షతోనే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారని వెల్లడించారు.ఆయన ఏ మతాన్ని కించపరచలేదని పేర్కొన్నారు.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది… విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?