గ్రూప్ -2 పరీక్ష వాయిదాపై టీఎస్ హైకోర్టులో విచారణ

గ్రూప్ -2 పరీక్ష వాయిదాపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ సుమారు 150 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు.

గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్ -2 రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు పిటిషన్ లో కోరారు.

ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.అనంతరం టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులను కలిసిన అభ్యర్థులు వాయిదా వేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

అయితే అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు అభ్యర్థులు.సిలబస్ పెంపుతో పాటు ఇతర పరీక్షల కారణంగా ప్రిపరేషన్ కష్టంగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు.

చరణ్ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఏడాదికి 100 రోజుల పాటు మాలలోనే ఉంటారా?