ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.విజయవాడలోని ధర్నాచౌక్ లో ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ధర్నాకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

మరోవైపు వెయ్యి మందితో ధర్నా నిర్వహించేందుకు విద్యుత్ ఉద్యోగులు అనుమతి కోరారు.ఈ క్రమంలో ఐదు వందల మందితో ధర్నా చేసుకునే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.

న్యూజిలాండ్ బీచ్‌లో వింత తిమింగలం.. చూసి షాక్ అవుతున్న స్థానికులు..