మీరు బక్కగా చాలా బలహీనంగా ఉన్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!
TeluguStop.com
సాధారణంగా కొందరు బక్కగా మరియు చాలా బలహీనంగా ఉంటారు.వయసుకు తగ్గ బరువు ఉండరు.
అధిక బరువు ఎంత ప్రమాదకరమో తక్కువ బరువు కలిగి ఉండటం కూడా అంతే ప్రమాదకరం.
అలాగే ఓవర్ వెయిట్ ఉన్నవారికి బరువు తగ్గడం ఎంత కష్టమో.లో-వెయిట్( Low Weight ) ఉన్న వారికి బరువు పెరగడం కూడా అంతే కష్టంగా ఉంటుంది.
బరువు పెరగడం కోసం ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుంది.కాబట్టి హెల్తీ గా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం.
"""/" /
అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) అందుకు అద్భుతంగా సహాయపడుతుంది.
బక్కగా, బలహీనంగా ఉన్నవారు తమ డైట్ లో ఈ స్మూతీని కనుక చేర్చుకుంటే వారం రోజుల్లోనే రిజల్ట్ ను గమనిస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు బాదం గింజలు,( Almonds ) ఐదు జీడిపప్పులు,( Cashew ) రెండు ఎండిన అత్తిపండ్లు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, రెండు స్పూన్లు వేయించి పొట్టు తొలగించిన వేరుశనగలు, ఒక స్పూన్ పెసలు, రెండు స్పూన్లు శనగలు వేసి వాటర్ తో ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలు వేసుకోవాలి.అలాగే ఒక అరటి పండు మరియు ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
తద్వారా మన స్మూతీ అనేది సిద్ధం అవుతుంది.రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని కనుక తీసుకుంటే బాడీలో కేలరీలు చక్కగా పెరుగుతాయి.
బక్కగా ఉన్నవారు పుష్టిగా మారతారు.బలహీనత దూరమవుతుంది.
ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునే వారికి ఈ స్మూతీ చాలా బాగా సహాయపడుతుంది.పైగా ఈ స్మూతీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది.
ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా?.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!