చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ హెల్తీగా ఉండాలా..అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే!

చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటేనే.మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు లేకుండా అందంగా, కాంతివంతంగా క‌నిపిస్తారు.

అందుకే చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడూ హెల్తీగా ఉంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.మ‌రి అందు కోసం ఏం చేయాలి.

? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న విష‌యాలు అస్స‌లు ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా చాలా మంది కామ‌న్‌గా చేసే పొర‌పాటు ఫేస్ వాష్ చేసుకోక‌పోవ‌డం.దీని వ‌ల్ల దుమ్ము, ధూళి పెరుకుపోయి.

చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.దాంతో అనేక స‌మస్య‌లు వ‌చ్చి ఇబ్బంది పెడుతుంటాయి.

అందుకే ఆయిలీ స్కిన్ వారు రోజుకు నాలుగైదు సార్లు, డ్రై స్కిన్ వారు రోజుకు రెండు, మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి.

అలాగే రాత్రి నిద్రించే ముందు మేక‌ప్ తీసి ప‌డుకోవాలి.లేదంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి అన్న సంగ‌తి తెలిసిందే.

అయితే మేక‌ప్ తీయ‌డ‌మే కాదు.నిద్రించే ముందు క్లెన్సింగ్, మాశ్చరైజింగ్ రెండూ చేసుకోవాలి.

అప్పుడు స్కిన్ హెల్తీగా ఉంటుంది.చ‌ర్మ ఆరోగ్యం స‌రిగ్గా లేదు అంటే.

ఖ‌చ్చితంగా తేమ త‌గ్గిపోతుంది.అలా జ‌ర‌గ‌కుండా ఉండాలీ అంటే.

రోజుకు మూడు నుంచి నాలుగు లీడ‌ర్ల వాట‌ర్ తీసుకోవాలి. """/"/ తాజా పండ్ల‌ను, ఆకుకూర‌ల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

మ‌రియు న‌ట్స్‌ను త‌ప్ప‌కుండా తినాలి.ఇక చాలా మంది వేస‌వి కాలంలో మాత్ర‌మే సన్ స్క్రీన్‌ లోషన్ యూజ్ చేస్తారు.

కానీ, సీజ‌న్ ఏదైనా బ‌య‌ట‌కు వెళ్లే ముందు సన్‌ స్క్రీన్‌ అప్లై చేసుకుంటే చ‌ర్మ క‌ణాలు దెబ్బ తిన‌కుండా ఉంటాయి.

చ‌ర్మం మృదువుగా, అందంగా క‌నిపించాలంటే.పాలు, పెరుగు, ట‌మాటా, ఆలు గ‌డ్డ‌, నిమ్మ‌, ఓట్స్‌, క‌ల‌బంద, పెస‌ర పిండి, శెన‌గ పిండి.

ఇలాంటి న్యాచుర‌ల్ ప్రొడెక్ట్స్‌తో ప్యాక్స్ త‌యారు చేసుకుని వాడితే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే వారానికి ఖ‌చ్చితంగా రెండు సార్లు స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.లేదంటే డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతాయి.

దాంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

గగనతలంలోనే అమ్మకి సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.. వైరల్ వీడియో..