జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.. అయితే ఆలస్యం వద్దు వెంటనే దీన్ని డైట్ లో చేర్చుకోండి!
TeluguStop.com
వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.ఈ క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది.
కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.
ఇందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి.సరైన పోషకాలు మెదడుకు అందకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది.
దాంతో జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సైతం తగ్గిపోతుంటాయి.మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా.
? అయితే అసలు ఆలస్యం చేయకండి.ఇప్పుడు చెప్పబోయే లడ్డూను డైట్ లో చేర్చుకోండి.
ఈ హెల్తీ లడ్డూను రోజుకు ఒకటి తీసుకుంటే చాలు జ్ఞాపక శక్తి తగ్గడం కాదు రెట్టింపు అవుతుంది.
అలాగే మరిన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ బ్రెయిన్ బూస్టర్ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఎనిమిది స్పూన్లు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) వేసుకోవాలి.
"""/" /
అలాగే రెండు కప్పులు మరమరాలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, మరమరాలు వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
చివరిగా నాలుగు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్,( Peanut Butter ) నాలుగు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.
ఈ లడ్డూలను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజుకొక లడ్డు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే మీ మెదడు సూపర్ షార్ప్ గా మారుతుంది.
జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి రెట్టింపు అవుతాయి.ఆల్జీమర్స్ వంటి బ్రెయిన్ సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అలాగే ఈ లడ్డూను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.మోకాళ్ళ నొప్పు( Knee Pain )లు వేధించకుండా ఉంటాయి.
వెయిట్ లాస్ అవుతారు.మరియు జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతుంది.
పల్చటి జుట్టు రెండు నెలల్లో దట్టంగా మారాలంటే ఇలా చేయండి!