కంటి చూపు రోజురోజుకు తగ్గుతున్నట్లు అనిపిస్తుందా.. అయితే ఈ జ్యూస్ మీ డైట్ లో ఉండాల్సిందే!
TeluguStop.com
ఇటీవల కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది.స్కూల్ కి వెళ్లే పిల్లవాడు సైతం చూపు సరిగ్గా కనిపించక కళ్ళద్దాలపై ఆధారపడుతున్నాడు.
పోషకాల కొరత, మొబైల్ ఫోన్ ను అధికంగా వాడటం, గంటలు తరబడి టీవీలకు అతుక్కుపోవడం.
ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.మీకు కూడా రోజు రోజుకు కంటి చూపు( Eye Sight ) తగ్గుతున్నట్లు అనిపిస్తుందా.
అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.
మరి ఆ జ్యూస్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అది అందించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు ఉసిరికాయలను ( Amla )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక కీర దోసకాయను( Green Cucumber ) కూడా తీసుకుని వాటర్ తో కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ స్లైసెస్ మరియు ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు రెబ్బలు కరివేపాకు, అర అంగుళం అల్లం ముక్క( Ginger ), వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో చిటికెడు పింక్ సాల్ట్ ( Pink Salt )కలిపి సేవించాలి.
ఈ కీర దోసకాయ ఉసిరికాయ కరివేపాకు జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.
ముఖ్యంగా కంటి చూపును మెరుగు పరచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.ఈ జ్యూస్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
"""/" /
అందువల్ల ఈ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కంటి చూపు పెరుగుతుంది.
కంటి సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.వయసు పైబడిన కూడా కళ్లద్దాలపై ఆధార పడాల్సిన అవసరం రాదు.
కాబట్టి కంటి చూపు తగ్గుతోందని భావిస్తున్న వారు తప్పకుండా ఈ హెల్తీ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.
పైగా ఈ జ్యూస్ ను రోజు తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
మరియు శరీరం హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది.