ఈ ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు తీసుకుంటే వయసు తగ్గడం మొదలవుతుందా..
TeluguStop.com
భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వయసు పెరగడం అనేది సర్వసాధారణమైన విషయమే.
అయితే ప్రతి మనిషి వయసు పెరిగే కొద్ది శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి.
ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించే వ్యక్తి వయసు పెరిగే కొద్దీ తెల్ల వెంట్రుకలు కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి.
వయసు మీద పడుతున్న యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ పరిస్థితిని ఎదురుకోవడానికి 20 సంవత్సరాల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది.
క్రమం తప్పకుండా శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.మరి ఏ వయసులో ఎలాంటి ఆహారం తీసుకుంటే యవ్వనంగా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
20 సంవత్సరాలు దాటాక ప్రతిరోజు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
ఉదాహరణకు బఠానీలు, వేరుశనగలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు లాంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది.
ముఖ్యంగా యుక్త వయసులో ఉండే యువతులు ఈ ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలసట, ఒత్తిడి లాంటి సమస్యలు దగ్గరికి రావు.
అలాగే జీర్ణాశయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఇంకా చెప్పాలంటే వారానికి మూడు రోజులైనా పెరుగును కచ్చితంగా తీసుకోవాలి.
కనీసం వారానికి ఒక్కసారైనా చేపలు, చికెన్, గుడ్లు లాంటి పోస్టికమైన తీసుకుంటూ ఉండాలి.
"""/"/
30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.
ఫలితంగా ఈ ఏజ్ లో గర్భం దాల్చాలి అనుకుంటే మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి.
పప్పులు, నారింజలు, బచ్చలి కూర వంటి ఆకుపచ్చ కూరగాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.
వారానికి మూడుసార్లు బాదంపప్పును తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కనబడకుండా ఉంటాయి.40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఈ వయసులోనే ఎక్కువగా ఉంటుంది.
ఈ వయసులో పిండి పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది.