అల్లం చేసే మేలు గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు… !!

అల్లం చేసే మేలు గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు… !!

మనం నాన్ వెజ్ వంటలు వండాలంటే తప్పకుండా అల్లం కావలిసిందే.అల్లం లేనిదే కూరకు ఎటువంటి రుచి అనేది రాదు.

అల్లం చేసే మేలు గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు… !!

అల్లం కూరల్లో రుచికోసం మాత్రమే కాదు.మనం రోజువారీ వంటకాల్లో అల్లం వాడడం వల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

అల్లం చేసే మేలు గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు… !!

అంతేకాదు అల్లం వల్ల మనకు తెలియని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.అవేంటో చూద్దాం.

!! చాలామందికి వర్షాకాలంలో అలాగే శీతాకాలంలో ఎక్కువగా తుమ్ములు, దగ్గులు,పడిశంతో బాధపడతారు.

అలాంటి వాళ్లకు అల్లం ఒక మంచి ఉపశమనం ఇస్తుంది.బాధపడేవాళ్ళు రెండు టీ స్పూన్ల అల్లం రసంలో టీస్పూన్ తేనె కలిపి ఉదయం సాయంకాలం రెండు పూటలా తీసుకుంటే జలుబు తగ్గిపోతుంది.

ఒక్కోసారి పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి అని అనిపించినపుడు అల్లం వాడడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

అల్లంలో ఉండే ఔషద గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి పంపించేయడానికి ఉపయోగపడతాయి.

అజీర్ణం మలబద్ధకం వంటి కారణాలవల్ల చర్మం మీద దద్దుర్లు ఏర్పడుతుంటే కొంచెం అల్లం రసాన్ని తీసుకుంటే దద్దుర్లు తగ్గుపోతాయి.

అలాగే చాలా మంది మహిళలు నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధపడుతూ ఉంటారు.అలాంటి వాళ్లకు అల్లం ఒక ఔషదంలా పనిచేస్తుంది.

"""/" / ఒక చిన్న అల్లం ముక్కను దంచి ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి తీసుకుంటే బహిష్టు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అవసరాన్ని బట్టి దీనిని రోజుకు రెండుసార్లు లేదా మూడుసార్లు తీసుకోవచ్చు.చాలామందికి ఉదయం పూట టీ తాగే అలవాటు ఉంటుంది.

ఇలాంటి వాళ్ళు టీ కాగుతున్నపుడు ఒక చిన్న అల్లం ముక్కని దంచి టీ లో వేసి మరిగించుకుని తాగితే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

అలాగే పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు అల్లం ముక్కతో మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది.

లేదంటే అల్లంను దంచి నీటిలో వేసి మరిగించాలి.లేదంటే ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే సరి.

అలాగే ఒక రాత్రి అంతా ఒక గిన్నెలో కొంచెం అల్లం తీసుకుని నీటిలో నానపెట్టాలి.

అలా నానబెట్టిన నీటిని సేవించడం ద్వారా వాత సంబంధిత రోగాలు నయం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

వైరల్: మాస్‌ కాపీయింగ్‌కు సాయం చేసిన టీచర్‌..