కరివేపాకు గురించి తెలిస్తే ప్రతి రోజు వదలకుండా తింటారు...అసలు పాడేయరు
TeluguStop.com
కరివేపాకును మనం ప్రతి రోజు వంటల్లో వేస్తూ ఉంటాం.కరివేపాకు వంటకు రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
అయితే చాలా మంది వంటల్లో వేసిన కరివేపాకును ఏరి పారేస్తూ ఉంటారు.ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే కరివేపాకును పాడేయకుండా తింటారు.
ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.కరివేపాకు చెట్టు కాడలు, బెరడును కషాయంగా తయారుచేసి త్రాగితే త్వరగా రక్తపోటు తగ్గుతుంది.
అయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే త్రాగాలి.మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు ఆహారంలో కొన్ని కరివేపాకు ఆకులను కలిపి తినాలి.
ఆలా తినలేని వారు రెండు రోజులకు ఒకసారి కరివేపాకు జ్యుస్ త్రాగితే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.
కరివేపాకు ఆరోగ్యానికే కాదు సౌందర్యంలో కూడా బాగా సహాయపడుతుంది.కరివేపాకు నూనెను తలకు రాసి మర్దన చేస్తూ ఉంటే తెల్లబడటం, జుట్టు రాలటం వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా కరివేపాకు ఆకులను తింటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అజీర్ణం సమస్యలు ఉన్నవారు కరివేపాకు,జీలకర్ర మిశ్రమాన్ని తీసుకుంటే గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
కరివేపాకు ఆకులను మిక్సీ చేసి మజ్జిగలో కలుపుకొని త్రాగితే విరేచనాలు తగ్గిపోతాయి.అలాగే కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి త్రాగిన మంచి ఫలితం ఉంటుంది.
ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..