చ‌లి కాలంలో పిల్ల‌ల‌కు అస్స‌లు పెట్ట‌కూడ‌ని ఆహారాలు ఇవే!

అస‌లే వింట‌ర్ సీజ‌న్‌.ఈ సీజ‌న్‌లో తీవ్ర‌మైన చ‌లితో పాటుగా రోగాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

ముఖ్యంగా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, చ‌ర్మ వ్యాధులు, అల‌ర్జీలు ఇలా అనేక ర‌కాలు స‌మ‌స్య‌లు ఎప్పుడు ఎటాక్ చేద్దామా అని కాచుకుని కూర్చుంటాయి.

అయితే ఈ చ‌లి కాలంలో పిల్ల‌ల ఆరోగ్యం, ఆహారం విష‌యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల్సి ఉంది.

ఎందుకంటే, పిల్లలకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.ఈ కాలంలో మ‌రింత త‌గ్గిపోతుంది.

దాంతో వారు త్వ‌ర‌గా జ‌బ్బుల బారిన ప‌డ‌తారు.అలాగే ఈ వింట‌ర్ సీజ‌న్‌లో కొన్ని ఆహారాల‌ను పిల్ల‌ల‌కు అస్స‌లు పెట్ట‌కూడదు.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సీజ‌న్‌లో పంచ‌దార‌తో త‌యారు చేసిన స్వీట్ల‌ను పిల్ల‌ల‌కు అస్సలు పెట్ట‌కూడ‌దు.

వీటి వ‌ల్ల వైట్ బ్ల‌డ్ సెల్స్ త‌గ్గిపోయి.బ్యాక్టీరియల్ మ‌రియు వైర‌ల్ ఇన్‌ఫెక్షన్స్ వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.

చాలా మంది ఈ వింట‌ర్‌లో వేడి వేడిగా తినాల‌ని.ఫ్రిజ్‌లో పెట్టినవి వేడి చేసి తింటుంటారు.

పిల్ల‌ల‌కు కూడా పెడుతుంటారు.కానీ, ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు వేడి చేసి పిల్ల‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇవ్వ‌రాదు.

దాని వ‌ల్ల వారి ఆరోగ్యాన్ని త్వ‌ర‌గా దెబ్బ తీస్తోంది.అలాగే డీప్ ఫ్రై చేసిన పదార్థాల‌ను కూడా ఈ సీజ‌న్‌లో పిల్ల‌ల‌కు పెట్ట‌కూడదు.

చాలా మంది సాయంత్రం వేళ డీప్ ఫ్రై చేసిన ఆహారాలను.స్నాక్స్ రూపంలో పిల్ల‌ల‌కు పెడ‌తారు.

కానీ, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు పిల్ల‌లు తీసుకోవ‌డం లాలాజలం మందంగా తయారై.

తేమ పెరుగుతుంది.దాంతో.

జలుబు, ద‌గ్గు, గొంతు సంబంధిత సమస్యలు త‌లెత్తుతాయి.ఇక పాల ప‌దార్థాలు ఆరోగ్యానికి ఎంత మంచి చేసిన‌ప్ప‌టికీ.

ఈ వింట‌ర్ సీజ‌న్‌లో వాటిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌క‌పోవ‌మే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.అలాగే ఈ సీజ‌న్‌లో పిల్ల‌ల‌కు కూల్ డ్రింక్స్‌, ఐస్ క్రీమ్స్ వంటివి కూడా ఇవ్వ‌కూడ‌దు.

అయితే పిల్ల‌ల ఆహారంలో కూరగాయలు అందులోనూ దుంపకూరలు ఉండేట్టుగా చూసుకోవాలి.రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దుంప‌ల్లో పుష్కలంగా ఉంటాయి.

అలాగే శ‌రీర ఉష్ణోగ్రతల‌ను స‌మ‌తుల్యం చేయ‌డంలోనూ దుంప‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఇక దుంప‌ల‌తో పాటుగా ఆకుకూర‌లు, తాజా పండ్లు, న‌ట్స్‌, మాంసం వంటివి పిల్ల‌ల డైట్‌లో ఉండే చేసుకోవాలి.

పవన్ కళ్యాణ్ రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తారా… ఇలాంటి అలవాటు కూడా ఉందా?