కరోనా టీకా పెట్టిన మంట.. ఉద్యోగం ఊడేలా చేసింది.. ?

ఒక కరోనా టీకా ఓ వ్యక్తి ఉద్యోగాన్ని ఊడేలా చేసింది.కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తెలుసుకుంటే.

కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ గత నెల 2న కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

అయితే ఆయన నిబంధనలకు విరుద్ధంగా తన స్వగృహంలో ఈ టీకా వేయించుకున్నారు.కాగా కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం కరోనా వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా దవాఖానలోనే ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యాక్సినేషన్‌ అనంతరం టీకా తీసుకున్నవారు అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.అయితే మంత్రి బీసీ పాటిల్‌ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంట్లోనే టీకా తీసుకోగా ఈ అంశం కర్ణాటకలో చర్చాంశనీయంగా మారింది.

దీంతో మంత్రికి ఇంటి వద్ద కరోనా టీకా వేసినందుకు ఆరోగ్య శాఖ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

కాని మంత్రిని మాత్రం వదిలేయడం గమనార్హం.

ఇదేందయ్యా ఇది.. కూతురి తలపై సీసీటీవీ అమర్చిన తండ్రి.. ఎందుకంటే.?