బ్రేక్‌ఫాస్ట్‌లో కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి?

సాధార‌ణంగా చాలా మందికి బ్రేక్ ఫాస్ట్‌లో కార్న్ ఫ్లెక్స్ తినే అల‌వాటు ఉంటుంది.

ముఖ్యంగా ఉరుకుల పరుగుల జీవితాన్ని గ‌డిపే ఉద్యోగ‌స్తులు కార్న్‌ ఫ్లేక్స్ ‌నే బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్క‌వ‌గా తీసుకుంటుంటారు.

ఎందుకంటే, త్వ‌ర‌లో ప్రిపేర్ అయ్యే బ్రేక్ ఫాస్ట్‌లలో కార్న్ ఫ్లేక్స్ ఒక‌టి.కార్న్‌ఫ్లేక్స్ కొన్ని తీసుకుని వాటిల్లో పాలు పోసి చ‌క్క‌గా లాగించేస్తారు.

పిల్ల‌ల‌కు కూడా కొంద‌రు దీనినే పెడుతుంటారు.రుచి బాగుండ‌డంతో.

వారు కూడా ఇష్టంగానే తింటారు.అయితే రుచి విష‌యం ప‌క్క‌న పెడితే.

కార్న్ ఫ్లేక్స్ అస‌లు ఎంత వ‌ర‌కు ఆరోగ్యానికి మంచిది అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్త‌వానికి కార్న్ ఫ్లేక్స్‌లో మొక్క‌జొన్న మాత్ర‌మే కాదు.షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వంటివి కూడా ఉంటాయి.

పైగా హై గ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి.అందువ‌ల్ల, కార్న్ ఫ్లేక్స్‌ను త‌ర‌చూ తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగి పోతాయి.

అందువ‌ల్ల‌, మ‌ధుమేహం వ్యాధి ఉన్న వారే కాదు.ఇత‌రులు కూడా కార్న్ ఫ్లేక్స్‌ను అతిగా తీసుకోరాదు.

"""/" / అలాగే కార్న్ ఫ్లేక్స్ త‌ర‌చూ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే.అందులో అధిక శాతంలో ఉండే ఫ్యాట్స్ మ‌రియు షుగ‌ర్స్‌‌ శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

ఫ‌లితంగా అధిక బ‌రువు మ‌రియు గుండె సంబంధిత జ‌బ్బుల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

కార్న్ ఫ్లేక్స్ అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.

ఇక కార్న్ ఫ్లేక్స్ తయారీలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వాడ‌తారు.ఇది శ‌రీరానికి ఏ మాత్రం మంచిది కాదు.

అదేవిధంగా, కార్న్ ఫ్లేక్స్‌ను త‌ర‌చూ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే.మెద‌డు చురుకుత‌నం త‌గ్గుంది.

అందువ‌ల్ల, ఫాస్ట్‌గా అయిపోతుంద‌నో, టేస్ట్‌గా ఉంటుంద‌నో రెగ్యుల‌ర్‌గా బ్రేక్ ఫాస్ట్‌లో కార్న్ ఫ్లేక్స్‌ను మాత్రం తీసుకోకండి.

ఇలా చేస్తే పై చెప్పుకున్న స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

వీడియో: మెరుపు వేగంతో ఢీ కొట్టిన కారు.. గాల్లో ఎగిరిపోయిన స్టూడెంట్..