దాల్చిన చెక్కను పక్కన పెట్టేస్తున్నారా..?
TeluguStop.com

సుగంధ ద్రవ్యాల్లో ఎక్కువ మందికి నచ్చేవాటిలో దాల్చిన చెక్క ఒకటి.కొంతమంది దాన్ని మసాలాలలో కాకుండా విడిగా కూడా తింటుంటారు.


దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.నోటీ దుర్వాసనతో పాటు సువాసన, రుచిని అందిస్తుంది.


దాల్చిన చెక్కతో సితోపలాది చూర్ణం.త్వగాది లేహ్యం, త్వగాది చూర్ణం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి.
దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.దీనిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ దీని అతి ముఖ్యమైన లక్షణం.
వంటకాల్లో దాల్చిన చెక్కను పక్కన పడేస్తున్నారా.దీన్ని తినడం లేదా.
వంటల్లో ఘాటు వాసనను, తిన్నప్పుడు స్వీట్ నెస్ ను అందించే ఈ దాల్చిన చెక్క ఓన్లీ వంటలకే పరిమితం కాదు.
టీ లేదా ఇతర పానీయాల్లో కూడా దాల్చిన చెక్కను వాడొచ్చు.దాల్చిన చెక్క వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి చూద్దామా.
దాల్చిన చెక్కను వేరే దేశాల్లో మిరాకిల్ ఫుడ్ అని పిలుస్తారని నిపుణులు తెలిపారు.
టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఒంట్లో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
దాల్చిన చెక్క ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.పేగుల్లో ఏమైనా సమస్య ఉంటే దాల్చిన చెక్క తొలగిస్తుంది.
దాల్చిన చెక్క రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టడంలో దోహదపడుతుంది.అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి దాల్చిన చెక్క తోడ్పడుతుంది.
దాల్చిన చెక్క గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.కీళ్ల నొప్పులు తగ్గించడంలోనూ దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది.
శరీరంలోని నిస్సత్తువను దూరం చేసి రోజంతా సరిపడే శక్తిని ఇస్తుంది.కణాలు నష్టపోకుండా కాపాడుతుంది.
క్యాన్సర్ కారకాలతో పోరాడుతుందని నిపుణులు తెలియజేశారు.
ఇదేందయ్యా ఇది: చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?