చేతికి రాగి ఉంగరం పెట్టుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

చేతి వేళ్లకు ఉంగరాలు ధరించడం అనేది అలంకరణలో ఒక భాగం.మనలో చాలా మంది రెగ్యులర్ గా బంగారం ఉంగరాలు ధరిస్తారు.

గోల్డ్ రింగ్స్ గురించి కాసేపు పక్కన పెట్టేస్తే.చేతికి రాగి ఉంగరం( Copper Ring ) పెట్టుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పుందుతార‌ని నిపుణులు చెబుతున్నారు.

రింగ్ ఫింగర్ కు రాగి ఉంగరం ధరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

రాగి లోహం మన మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. """/" / శరీర ఉష్ణోగ్రతను( Body Temperature ) నియంత్రించడంలో రాగి సహాయప‌డుతుంది.

వేడి అసమతుల్యతకు సంబంధించిన పరిస్థితులను నిరోధించడంలో.శ‌రీరాన్ని కూల్ గా మార్చ‌డంలో రాగి ఉగ‌రం తోడ్ప‌డుతుంది.

అలాగే కీళ్ల నొప్పులు( Joint Pains ) ఉన్న‌వారు చేతికి రాగి ఉంగ‌రం ధ‌రించ‌డం మంచి ఎంపిక అవుతుంది.

ఎందుకంటే రాగి లోహం ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతుంది.కీళ్ల నొప్పులను త‌రిమికొడుతుంది.

"""/" / చేతికి రాగి ఉంగ‌రం ధ‌రించ‌డం వ‌ల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.

ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

అలాగే ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది త‌ర‌చూ త‌ల‌నొప్పితో( Headache ) బాధ‌ప‌డుతుంటారు.

అలాంటి వారు రాగి ఉంగ‌రం ధ‌రించ‌డం ఎంతో ఉత్త‌మం.రాగి లోహం త‌ల‌నొప్పి నుంచి చ‌క్క‌ని ఉప‌శ‌మనాన్ని అందిస్తుంది.

మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది.అంతేకాదు చేతికి రాగి ఉంగరం ధరించడం వల్ల సూర్యుడి నుంచి పాజిటివ్ శక్తి లభిస్తుంది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంది.శ‌రీరంలో ర‌క్త ప్రసరణను మెరుగుపడుతుంది.

ఫ్రీ రాడికల్ ఉత్పత్తి తగ్గుతుంది.రాగి లోహం చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచ‌డంలోనూ స‌హాయ‌ప‌డుతుంది.

త‌ద్వారా చ‌ర్మం యవ్వ‌నంగా, కాంతివంతంగా క‌నిపిస్తుంది.అనేక చ‌ర్మ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చు.

కాబ‌ట్టి, ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందాలి అనుకుంటే త‌ప్ప‌కుండా ఉంగరపు వేలుకు రాగి ఉండ‌రాన్ని ధ‌రించండి.

ముల్తానీ మట్టితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండిలా!