వెయిట్ లాస్ కు వరం వాల్ నట్ మిల్క్.. డైట్ లో చేర్చుకుంటే మరెన్నో బెనిఫిట్స్!

అద్భుతమైన నట్స్ లో వాల్ నట్స్ ఒకటి.ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషక విలువలు వాల్ నట్స్ లో నిండి ఉంటాయి.

అయితే వాల్ నట్స్ మాత్రమే కాదు వాల్ నట్ మిల్క్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా వెయిట్ లాస్ కు ఈ మిల్క్ ఒక వరమనే చెప్పాలి.వాల్ న‌ట్ మిల్క్ ను డైట్ లో చేర్చుకుంటే వెయిట్ లాస్ తో సహా మరెన్నో హెల్త్‌ బెనిఫిట్స్‌ ను సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ వాల్ న‌ట్ మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ప‌న్నెండు నుంచి ప‌దిహేను వాల్‌ నట్స్ ను వేసుకోవాలి.

అలాగే ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.అనంతరం బ్లెండ‌ర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న వాల్ నట్స్ ను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వ‌స్త్రం సహాయంతో వాల్ న‌ట్స్ మిల్క్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/"/ ఈ మిల్క్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి సేవించాలి.

వారంలో కనీసం మూడు సార్లు ఈ మిల్క్ ను తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.

మెదడు సూపర్ షార్ప్ గా పని చేస్తుంది.చెడు కొలెస్ట్రాల్ క‌రిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దాంతో వివిధ రకాల గుండె జ‌బ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. """/"/ అంతేకాదు వాల్ నట్ మిల్క్ ను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయిజ‌ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు.

చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా మారుతుంది.మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

ఇన్ని ప్రయోజనాలను అందించే వాల్ నట్ మిల్క్ ను డైట్ లో చేర్చుకుంటారు కదా!.

ప్రభాస్ తో నాకు పెళ్లైందని అప్పట్లో వార్తలు వచ్చాయి.. పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు!