భోజనం తర్వాత ఓ పది నిమిషాలు నడిస్తే..మస్తు బెనిఫిట్స్!
TeluguStop.com
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులను దరి చేరకుండా రక్షిస్తుంది.
శరీరం ఫిట్‌గా ఉండేందుకు సహాయపడుతుంది.అందుకే స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నడకను అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
నడక ఆరోగ్యానికి మంచిదే.అయితే కొన్ని కొన్ని సమయాల్లో చేస్తే.
మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కేవలం పదంటే పది నిమిషాలు నడిస్తే.
ఎన్నో లాభాలు పొందొచ్చు.మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడవటం చేస్తే.
గుండె పోటు మరియు గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
అలాగే ఒక్కో సారి భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.అయితే తిన్న తర్వాత పది నిమిషాలు పాటు అటూ, ఇటు నడిస్తే.
కడుపు ఉబ్బరం తగ్గడమే కాదు జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగుతుంది.
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.ఈ మధ్య కాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో నానా తిప్పలు పడుతున్నారు.
అయితే భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడిస్తే.పొట్ట వద్ద కొవ్వు చేరుకోకుండా ఉంటుంది.
ఆహారం తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరుగుతాయన్న సంగతి తెలిసిందే.కానీ, భోజనం చేసిన వెంటనే ఓ చిన్న పాటి నడక వల్ల.
బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోనే ఉంటాయి.మరియు రక్త పోటు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
"""/" /
అంతేకాదు, ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడవటం చేస్తే.
నిద్ర త్వరగా పడుతుంది.అదే సమయంలో నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్, తలనొప్పి వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.అయితే నడిచే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భోజనం తరువాత మెల్లగా నడవాలి.
అలా కాకుండా వేగంగా నడిచారంటే.కడుపు నొప్పి లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరియు భోజనం తర్వాత పది, పదిహేను నిమిషాల కంటే ఎక్కువ నడవరాదు.
అల్లు అర్జున్ లైనప్ చూస్తే మతిపోతుంది..పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను కొట్టబోతున్నడా..?