పసుపు, నిమ్మ టీ తో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?

ప‌సుపు, నిమ్మ కాయ‌.ఈ రెండిటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ఎన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉండే ప‌సుపు మ‌రియు నిమ్మ విడి విడిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని అంద‌రికీ తెలుసు.

కానీ, క‌లిపి తీసుకుంటే.మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

అందులోనూ ప‌సుపు, నిమ్మ టీ సేవించ‌డం వ‌ల్ల ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ప‌సుపు, నిమ్మ టీ ఎలా త‌యారు చేయాలి.దాని వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ప‌సుపు వేసి బాగా మ‌రిగించుకోవాలి.అలా మ‌రిగించుకున్న నీటిని ఒక గ్లాస్‌లో వ‌డ‌గ‌ట్టి.

అందులో నిమ్మ‌ర‌సం మ‌రియు తేనె మిక్స్ చేసుకుని సేవించాలి.ఈ ప‌సుపు, నిమ్మ టీని ప్ర‌తి రోజు ఉద‌యం పూట తీసుకుంటే.

అనేక బెనిఫిట్స్ పొందొచ్చు.ముఖ్యంగా ఈ టీ సేవించ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.

ఫ‌లితంగా గుండె సంబంధిత జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.అలాగే మ‌ధుమేహం ఉన్న వారు ఈ ప‌సుపు, నిమ్మ టీ సేవించ‌డం వ‌ల్ల.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. """/"/ ప‌సుపు, నిమ్మ టీ తాగ‌డం వ‌ల్ల మ‌ధుమేహం వ్యాధి వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది.

అందువ‌ల్లు, మ‌ధుమేహం ఉన్న వారే కాదు.లేని వారు కూడా ఈ టీని సేవించ‌వ‌చ్చు.

ఇక నేటి కాలంలో చాలా మంది మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.మెద‌డు ప‌ని తీరు త‌గ్గిన‌ప్పుడే మ‌తిమరుపు స‌మ‌స్య త‌లెత్తుతుంది.

అయితే మెదడు ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలో పసుపు, నిమ్మ‌ టీ బాగా పని చేస్తుంది.

కాబ‌ట్టి, మ‌తిమ‌రుపు ఉన్న వారు ప్ర‌తి రోజు ఈ టీని సేవిస్తే మంచిది.

అలాగే ప్ర‌తి రోజు ప‌సుపు, నిమ్మ టీ సేవించ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

ఫ‌లితంగా.జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఇక ఒత్తిడి, డిప్రెష‌న్‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ ప‌సుపు, నిమ్మ టీ బాగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, ఈ స‌మ‌స్య‌లు ఉన్న వారు ప్ర‌తి రోజు ఒక క‌ప్పు ప‌సుపు, నిమ్మ టీ తాగితే ఉత్త‌మం.

బోండా ఉమకు ఓటమి భయం..: వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి