క‌రోనాకు దూరంగా ఉండాలా..అయితే ఈ ఆకు వాడాల్సిందే!

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా భార‌త్‌లో క‌రోనా వికృత రూపం దాల్చింది.ఈ క్ర‌మంలోనే దేశంలో రోజు రోజుకు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.

వేలాది మంది ఈ మాయ‌దారి వైర‌స్ కాటుకు బ‌లైపోతున్నారు.ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయ‌లు అలుముకుంటున్నాయి.

ఇక ఈ మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోవాలంటే.రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచి.క‌రోనా నుంచి ర‌క్షించ‌డంలో తిప్ప తీగ ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

గ్రామాల్లో విరి విరిగా క‌నిపించే తిప్ప తీగకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఎన్నో జ‌బ్బుల‌ను నివారించ‌గ‌లిగే శ‌క్తి తిప్ప తీగ‌కు ఉంది.ముఖ్యంగా ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో తిప్ప తీగ ఆకుల‌ను మెత్త‌గా నూరి గోలీకాయంత ఉండలు చేసి ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.దాంతో వైర‌స్‌లు, ఇత‌ర జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఒక గ్లాస్ వేడి పాల‌లో అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడి మ‌రియు అర స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేస్తే దగ్గు, జలుబు, గొంతు నొప్పి మ‌రియు ఇత‌ర శ్వాసకోశ సమస్య‌లు దూరం అవుతాయి.

అలాగే అర స్పూన్ తిప్ప తీగ ఆకుల పొడిలో బెల్లం క‌లిపి ఉండ‌లా చేసుకుని తీసుకుంటే.

జ్వ‌రం రాకుండా ఉంటుంది.ఒక‌వేళ వ‌చ్చినా త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది.

అదేవిధంగా, మ‌ధుమేహాన్ని అదుపు చేయ‌డంలోనూ, జీర్ణ వ్యవస్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ, కిడ్నీ వ్యాధుల‌ను ద‌రి చేర‌కుండా చేయ‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉండేలా చేయ‌డంలోనూ తిప్ప తీగ ఆకులు స‌హాయ‌ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, ఎక్క‌డైనా తిప్ప తీగ క‌నిపిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌కండి.

హైదరాబాద్ పరిధిలో తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం..!