చ‌లికాలంలో చేమ‌ దుంపలు తింటే ఆ చింత‌ల‌న్నీ దూరం!

చేమ దుంప‌లంటే చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు.అస‌లు వాటిని తినేందుకే చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు.

కానీ, చేమ దుంప‌ల్లో ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా ప్ర‌స్తుతం  ఈ చలికాలంలో చేమ దుంప‌ల‌ను తీసుకుంటే ఆరోగ్య చింతలెంటినో  దూరం చేసుకోవ‌చ్చు.

మ‌రి చ‌లి కాలంలో చేమ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

సాధార‌ణంగా మిగిలిన కాలాల‌తో పోలిస్తే చ‌లి కాలంలో గుండె పోటు వ‌చ్చే రిస్క్ యాబై శాతం ఎక్కువ‌గానే ఉంటుంది.

చ‌లి కార‌ణంగా శరీర భాగాల్లో రక్త నాళాలు కుంచించుకుపోతాయి.రక్త ప్రసరణ త‌గ్గిపోతుంది.

ఫ‌లితంగా గుండె పోటుకు దారి తీస్తుంది.అయితే ఈ సీజ‌న్‌లో చేమ దుంప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ మెరుగు ప‌డుతుంది.

అదే స‌మ‌యంలో ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

"""/" / అలాగే చేమ‌ దుంప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అందులోని శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించి వైర‌స్‌లు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

బాడీ వెయిట్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాల‌నుకునే వారికి సైతం చేమ దుంప‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక ఆక‌లి త‌గ్గి చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

దాంతో బ‌రువు అదుపులో ఉంటుంది. """/" / అంతే కాదు, చేమ దుంపుల‌ను డైట్‌లో చేర్చుకుంటే అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మానిసిక స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.

కంటి చూపును పెంచుతాయి.లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రియు చేమ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాల‌న్నీ కూడా బ‌య‌ట‌కు పోతాయి.

కాబ‌ట్టి చేమ దుంప‌ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు.

MP Raghuramakrishnaraju : నర్సాపురం నుండే పోటీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు..!!