వానాకాలంలో వీటిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
TeluguStop.com
వానాకాలంలో ఆకాకరకాయలు( Aakakarakaya ) తీసుకోవడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
అయితే చాలామంది వీటిని తీసుకునేందుకు ఇష్టపడతారు.ఆకాకరకాయ వేపుడు వంటి రెసిపీస్ ని రుచిగా తయారు చేసుకొని కూడా మనం తినవచ్చు.
ఆకాకరకాయని పోషకాలతో నిండిన కూరగాయలుగా చెబుతారు.దీన్ని తీసుకుంటే చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.
మరి ఎన్ని లాభాలు ఉన్నా ఆకాకరకాయలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకాకరకాయని వానాకాలంలో( Monsoon ) తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా జలుబు, ఫ్లూ లాంటి సమస్యలతో వానాకాలంలో చాలా మంది తరచుగా బాధపడుతూ ఉంటారు.
"""/" /
ఇక ప్రతిసారి జలుబు, ఫ్లూ, జ్వరం లాంటి సమస్యలతో వైద్యుల వద్దకు పరిగెడుతూ ఉంటారు.
కానీ వానాకాలంలో ఆకాకరకాయను తీసుకోవడం వలన ఇలాంటి ఫ్లూ లకి( Flu ) దూరంగా ఉండవచ్చు.
అంతేకాకుండా ఊబకాయంకి సంబంధించిన ఫ్యాటీ లివర్( Fatty Liver ) సమస్య ఉన్న కూడా ఆకాకరకాయలు తీసుకోవడం ద్వారా దీనికి దూరంగా ఉండవచ్చు.
ఎందుకంటే ఆకాకరకాయలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ మైక్రోబియన్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
కాబట్టి వీటిని తీసుకోవడం వలన ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందవచ్చు. """/" /
ఆకాకరకాయల్ని తీసుకోవడం వలన ఫైబర్ తో పాటుగా విటమిన్ ఏ, విటమిన్ సి, మినరల్స్ కూడా లభిస్తాయి.
కాబట్టి ఆరోగ్య నిపుణులు కూడా ఆకాకరకాయని వానాకాలంలో ముఖ్యంగా తీసుకుంటే చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
ఆకాకరకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా అధికంగా ఉంటాయి.కాబట్టి దొరికినప్పుడు వదలకుండా వీటిని వండుకొని డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది.
ఇక వీటిని శుభ్రంగా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు కారం వేసి రుచికరంగా తయారు చేసుకొని తినవచ్చు.
మోక్షజ్ఞ విషయంలో మాత్రమే ఎందుకిలా జరుగుతోంది.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్ వైరల్!