సాక్సులు వేసుకుని నిద్రపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?
TeluguStop.com

సాధారణంగా బయటకు వెళ్లే సమయంలోనే కాళ్లకు సాక్సులు వేసుకుంటారు.ఒకవేళ కాళ్ల పగుళ్లు ఏర్పడినా లేదా ఈ వింటర్ సీజన్‌లో చలిని తట్టుకునేందుకు.


కొందరు ఇంట్లో కూడా సాక్సులు వేసుకుని తిరుగుతుంటారు.అయితే ఎప్పుడు వేసుకున్నా.


వేసుకోకపోయినా రాత్రి నిద్రించే సమయంలో మాత్రం కాళ్లకు సాక్సులు వేసుకుంటే చాలా మంచిదంటున్నారు నిపుణులు.
అదేంటీ, రాత్రి సాక్సులు వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటీ అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది.
అయితే వాస్తవానికి సాక్సులు వేసుకుని నిద్రపోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు పొందొచ్చు.పాదాలు మరియు కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల.
పాదాల వాపు, కాళ్ల తిమ్మిర్లు, కాళ్ల నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి.అయితే రాత్రి సమయంలో సాక్సులు వేసుకుని నిద్రించడం వల్ల పాదాల్లో బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగుపడుతుంది.
దాంతో పై చెప్పుకున్న సమస్యలకు దూరంగా ఉండొచ్చు.అలాగే చాలా మంది సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు.
"""/"/
అయితే మంచి కాటన్ సాక్సులు వేసుకుని నిద్రపోతే.పాదాలు వెచ్చగా ఉంటాయి.
ఇక నిద్రవేళలో మీ పాదాలను వెచ్చగా ఉంచడం ద్వారా చక్కటి నిద్ర పడుతుంది.
ఇక వేడి ఆవిర్లు.ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటారు.
ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆడవారిని అత్యధికంగా వేధించే సమస్య ఇది.అయితే ప్రతి రోజు నిద్రించే ముందు సాక్సులు వేసుకుంటే.
శరీర ఉష్ణోగ్రతలని క్రమబద్దీకరించి వేడి ఆవిర్ల సమస్యను దూరం చేస్తుంది.అలాగే సీజన్‌లో పని లేకుండా కొందరు ఎప్పుడూ చల్లగా మారిపోతుంటాయి.
అయితే పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండటం ఆరోగ్యానికి మరియు నిద్ర ఏ మాత్రం మంచిది కాదు.
కాబట్టి, రాత్రి నిద్రించే ముందు సాక్సులు వేసుకుని పడుకుంటే.పాదాలు వెచ్చగా ఉంటాయి.
ఇక మరో విషయం ఏంటంటే.ఎప్పుడూ టైట్‌గా ఉంటే సాక్సులు వేసుకోరాదు.
మృదువైన, శుభ్రమైన, నాణ్యమైన సాక్సులనే ధరించాలి.
అప్పుడు రజనీకాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్… జపాన్ లో ఆ ఘనత వీళ్లకే సొంతమా?