ఎడమవైపు తిరిగి నిద్రిస్తే.. ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

నిద్ర‌.ప్ర‌తి జీవికి ఎంతో అవ‌స‌రం.

ముఖ్యంగా మాన‌వుడు ఆహారం లేక‌పోయినా కొన్ని జీవించ‌గ‌ల‌డు కానీ, నిద్ర లేనిదే జీవించ‌లేడు.

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవ‌స‌రం.అయితే నిద్ర పోవ‌డం ఎంత ముఖ్య‌మో.

ఎలా నిద్ర పోతున్నాం అన్న‌ది కూడా అంతే ముఖ్యం.సాధార‌ణంగా ఒక్కొక్క‌రు ఒక్కోలా నిద్రిస్తుంటారు.

కొంద‌రు కుడివైపు నిద్రిస్తే.కొంద‌రు ఎడ‌మ‌వైపు నిద్రిస్తుంటారు.

ఇక మ‌రికొంద‌రు స్ట్రైట్‌గా ప‌డుకుంటారు.అయితే వీటితో ఎడ‌మ‌వైపు ప‌డుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.

అయితే ఎడ‌మ‌వైపే ఎందుకు ప‌డుకోవాలి.ఎడ‌మ‌వైపు ప‌డుకుంటేనే ఆరోగ్యానికి ఎందుకు మంచిది అంటే.

వాస్త‌వానికి జీర్ణాశయం, మూత్రాశయం, శోషరస గ్రంథులు, క్లోమం క‌డుపుకు లెఫ్ట్ సేడే ఉంటాయి.

మ‌నం తిన్న ఆహారం జీర్ణం కాగా.మిగిలిన వ్య‌ర్థాన్ని బయటకుపంపే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండాలంటే వాటిపై ఎలాంటి ఒత్తిడి ప‌డ‌కూడ‌దు.

అలా ప‌డ‌కూడ‌దంటే.కుడివైపుకు కాకుండా ఎడ‌మ‌వైపుకు ప‌డుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

అప్పుడే ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వ‌డంతో పాటు శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు సులువ‌గా బ‌య‌ట‌కు పోతాయి.

"""/"/ అలాగే ఎడ‌మ‌వైపుకు తిరిగి నిద్రించ‌డం వ‌ల్ల రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా జ‌రుగుతుంది.

ఫ‌లితంగా హార్ట్‌కు శ్ర‌మ త‌గ్గి.గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంచ‌డంతో పాటు ర‌క్త పోటు కూడా అదుపులో ఉంటుంది.

ఇక ఎడ‌మ‌వైపు ప‌డుకోవ‌డం వ‌ల్ల కాలేయం మరియు మూత్ర పిండాలపై ఒత్తిడి ప‌డ‌కుండా ఉంటాయి.

దాంతో అవి స‌క్ర‌మంగా ప‌ని చేస్తాయి.అదేవిధంగా, ఎడ‌వ‌వైపు ప‌డుకోవ‌డం వ‌ల్ల మ‌నం తినే ఆహారంలో ఉండే కొవ్వు ప‌దార్థాలు త్వ‌ర‌గా మ‌రియు సుల‌భంగా జీర్ణం అయిపోతాయి.

అలాగే క‌డుపులో ఉన్న యాసిడ్స్ గొంతులోకి రావడం వల్ల రాత్రిళ్లు గుండె మంట వచ్చే ప్రమాదం ఉంటుంది.

కానీ, ఎడ‌మ‌వైపు నిద్రిస్తే అలాంటి స‌మ‌స్యే ఉండ‌దు.ఇక ఎడ‌మ‌వైపు నిద్రించ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు కూడా మెరుగ్గా ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

‌.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత