సాఫ్రాన్ టీ తాగితే.. ఎన్ని జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చో తెలుసా?

కుంకుమ పువ్వు (సాఫ్రాన్‌) గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.అద్భుతమైన స్మెల్‌, కలర్, ఫ్లేవర్ క‌లిగి ఉండే కుంకుమ పువ్వు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన సుగంధ ద్ర‌వ్యం.

సాధార‌ణంగా గ‌ర్భిణీ స్త్రీల‌ను కుంకుమ పువ్వును తీసుకోమ‌ని చెబుతుంటారు.అయితే గ‌ర్భిణీలే కాదు.

ఎవ్వ‌రైనా కుంకుమ పువ్వును తీసుకోవ‌చ్చు.ఐర‌న్‌, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్‌, కాప‌ర్‌, సెలీనియం, విట‌మిన్ ఎ, విట‌మిన్‌ బి, విట‌మిన్ సి, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా కుంకుమ పువ్వులో ఎన్నో పోష‌క విలవ‌లు నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్యానికి కుంకుమ పువ్వు బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.ముఖ్యంగా కుంకుమ పువ్వుతో త‌యారు చేసిన టీను తీసుకుంటే.

అనేక జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.మ‌రి కుంకుమ పువ్వు టీని ఎలా త‌యారు చేసుకోవాలి? ఈ టీ తాగ‌డం వ‌ల్ల పొందే బెనిఫిట్స్ ఏంటీ? అన్న విష‌యాలు ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా గిన్నెలో ఒక క‌ప్పు పాల‌ను తీసుకుని.అందులో ఎనిమిది నుంచి ప‌ది కుంకుమ పువ్వు రేకులు వేసి మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత వ‌డ‌బోసుకుని కొద్దిగా తేనె క‌లిపి సేవించాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే.

సాఫ్రాన్‌లో ఉండే క్రోసిన్ మ‌తిమ‌రుపును త‌గ్గించి మెద‌డును చురుగ్గా, వేగంగా ప‌ని చేసేలా ప్రోత్స‌హిస్తుంది.

అలాగే చాలా మంది నిద్ర లేమితో బాధ ప‌డుతుంటారు.అలాంటి వారు ప్ర‌తి రోజు సాఫ్రాన్ టీ తాగితే.

మంచిగా నిద్ర ప‌డుతుంది. """/" / కుంకుమ పువ్వు టీ తీసుకుంటే.

అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పిలను స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తాయి.త‌లనొప్పి, అధిక ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డేవారు.

సాఫ్రాన్ టీ తీసుకుంటే వెంట‌నే రిలీఫ్ అవుతారు.ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, ఇమ్యూనిటీని పెంచ‌డంలోనూ, ర‌క్త పోటును అదుపులో ఉంచ‌డంలోనూ, క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గించ‌డంలోనూ సాఫ్రాన్ టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

రోజు నైట్ ఈ హోమ్ మేడ్ క్రీమ్ వాడితే స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?