అమ్మాయిలూ వాకింగ్ కాదు ర‌న్నింగ్ అల‌వాటు చేసుకోండి.. ఎందుకంటే?

వాకింగ్.వ్యాయామాల్లో అత్యంత సులువైనది మ‌రియు సుల‌భ‌మైన‌ది.

అందుకే చాలా మంది వాకింగ్ ను తమ డైలీ రొటీన్ లో భాగం చేసుకుంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటారు.అయితే అమ్మాయిలూ వాకింగ్ కాదు రన్నింగ్ ను అలవాటు చేసుకోండి.

వాకింగ్ కంటే రన్నింగ్ ఆరోగ్యానికి ఇంకా మంచిది.ముఖ్యంగా అమ్మాయిలు రోజుకు ఇరవై నిమిషాల పాటు రన్నింగ్ చేస్తే బోలెడ‌న్ని ప్రయోజనాలు లభిస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.అమ్మాయిలు ప్ర‌తి రోజూ రన్నింగ్ చేయడం వల్ల మెటబాలిజం రేటు రెట్టింపు అవుతుంది.

మెటబాలిజం రేటు పెరిగితే క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది.దాంతో శరీర బ‌రువు అదుపులోకి వస్తుంది.

అలాగే రెగ్యులర్ గా రన్నింగ్ చేయడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కండరాలు దృఢంగా మారుతాయి.గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.

అంతే కాదు, రోజూ ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల బ్లెడ్ ప్రెజర్ రెగ్యులేటర్ అవుతుంది.

ఒత్తిడి, డిప్రెషన్, అందోళ‌న‌ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మెదడు మునపటి కంటే వేగంగా పని చేస్తుంది.

ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.రోజు ఉదయం ఇర‌వై నిమిషాల పాటు రన్నింగ్ చేస్తే రోజంతా ఎంతో హుషారుగా మరియు యాక్టివ్ గా మార‌తారు.

"""/"/ నిద్రలేమి సమస్య నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.మధుమేహం బారిన పడకుండా ఉంటారు.

మరియు నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.అయితే రన్నింగ్ ను ఒకేసారి స్టార్ట్ చేయరాదు.

ముందు కాస్త ఫాస్ట్ గా నడవడం చేయాలి.ఆ తరువాత మెల్లమెల్ల‌గా వేగాన్ని పెంచుతూ రన్నింగ్ ను అలవాటు చేసుకోవాలి.

DASA స్కీమ్ అంటే ఏమిటీ? .. ప్రవాస భారతీయ విద్యార్ధులకు ఎలా ఉపయోగమంటే?