సమ్మర్‌లో బీరకాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
TeluguStop.com
సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది.రోజురోజుకు ఎండలు మంటెక్కిస్తున్నాయి.
ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎంత తీవ్రత పెరిగిపోతుండడంతో.ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఈ వేసవి కాలంలో కొన్ని కొన్ని ఆహారాలు ఆరోగ్యాన్ని మరియు చర్మాన్ని రక్షించడంలో ఎంతోగానో సహాయపడతాయి.
అలాంటి వాటిలో బీరకాయ ఒకటి.బీరకాయలో ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.
జింక్, ఐరన్, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
అందుకే బీరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా ఈ వేసవి కాలంలో అధిక దాహం, నీరసం వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడతాయి.
అయితే బీరకాయలో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.అందువల్ల, తరచూ బీరకాయ తీసుకుంటే.
అధిక దాహం, నీరసం, వేసవి తాపం వంటి సమస్యలు దూరం అవుతాయి.అలాగే ఈ వేసవిలో అత్యధికంగా వేధించే సమస్యల్లో డీహైడ్రేషన్ ఒకటి.
అయితే డీహైడ్రేషన్ సమస్య ఉన్న వారు డైట్‌లో బీరకాయ చేర్చుకోవడం మంచిది.బీరకాయ సులువుగా జీర్ణం అయిపోతుంది.
జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరిచి.మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది.
ఇక ఈ సీజన్‌లో చర్మం తరచూ పొడిబారిపోతుంటుంది.మరియు చెమటల కారణంగా చర్మం కాంతి హీనంగా మారుతుంది.
అయితే బీరకాయను తరచూ తింటే చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.బీరకాయను మెత్తగా పేస్ట్ చేసి.
అందులో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి చర్మానికి పట్టిస్తే.చర్మం మృదువుగా మారుతుంది.
అలాగే బీరకాయను డైట్‌లో చేర్చుకుంటే.వెయిట్ లాస్ అవ్వొచ్చు.
మధుమేహం రోగులకు కూడా బీరకాయ ఎంతో మంచిది.బీరకాయను తరచూ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.. సినీ ఇండస్ట్రీలో నయా సెంటిమెంట్!