ఈ పప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు!
TeluguStop.com
ఎర్ర కందిపప్పు అద్భుతమైన పప్పు ధాన్యాల్లో ఇది ఒకటి.ఎర్ర కంది పప్పు రుచిగా ఉండటమే కాదు.
పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ ఇలా పోషక విలువలెన్నో నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా ఎర్ర కంది పప్పు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా వారంలో రెండంటే రెండు సార్లు ఎర్ర కంది పప్పును తీసుకుంటే మస్తు హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ.? అసలు ఎర్ర కందిపప్పును ఏయే రూపంలో తీసుకోవాలి.
? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఎర్ర కందిపప్పును ఏదైనా ఆకు కూరతో వండుకుని తినొచ్చు.
ఎర్ర కందిపప్పుతో సంబార్ పెట్టుకుని తీసుకోవచ్చు.ఎర్ర కందిపప్పు టమాటో కలిపి వండుకుని తినొచ్చు.
ఇలా ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.వారానికి రెండు సార్లు ఈ పప్పును తీసుకుంటే గనుక శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.