స‌మ్మ‌ర్‌లో రెగ్యుల‌ర్‌గా ఈ వాట‌ర్ తాగితే..మ‌స్తు బెనిఫిట్స్‌!

మే నెల వ‌చ్చింది.ఎండ‌లు మ‌రింత ముదిరిపోయాయి.

ఉద‌యం తొమ్మిది దాటిందంటే చాలు.భానుడు భ‌గ భ‌గ మంటూ నిప్పులు కురిపిస్తున్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఠారెత్తిస్తున్న ఎండ‌ల‌కు.

చెమ‌ట‌లు, చికాకు, అల‌స‌ట‌, నీర‌సం ఇలా ఎన్నో స‌మ‌స్యలు ఇబ్బంది పెడ‌తాయి.వీటికి చెక్ పెట్టాలంటే ఖ‌చ్చితంగా కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఎండుద్రాక్ష (కిస్‌మిస్) నీటిని స‌మ్మ‌ర్‌లో రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే మాస్తు బెనిఫిట్స్ పొందొచ్చు.

ఒక గ్లాస్ వాట‌ర్‌తో కొన్ని ఎండు ద్రాక్ష‌ల‌ను వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే ఎండు ద్రాక్ష‌ల‌తో స‌హా ఆ వాట‌ర్‌ను తాగేయాలి.ఈ కిస్ మిస్ వాట‌ర్‌ను ప్ర‌తి రోజు సేవిస్తే.

వేడి త‌గ్గి శ‌రీరం చ‌ల్ల బ‌డుతుంది.వేస‌విలో ఎండ‌ల దెబ్బ‌కు ఇట్టే అల‌సిపోతుంటారు.

అయితే రెగ్యుల‌ర్‌గా ఎండు ద్రాక్ష నీటిని తీసుకుంటే అల‌సట, నీరసం వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/" / అలాగే వేస‌వి కాలంలో చాలా మంది హై బీపీ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతూ ఉంటాయి.

అయితే ఎండు ద్ర‌క్ష నీటిని తీసుకుంటే.ర‌క్త పోటు ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది.

ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఎండు ద్రాక్ష నీటిని తాగితే.నోటి దుర్వాస‌న స‌మ‌స్య ఉండ‌దు.

ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ పుష్ప‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల, ఎవ‌రైతే ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ ప‌డ‌తారో.

వారు ఎండు ద్ర‌క్ష‌ల‌ను నీటిలో నాన‌బెట్టి రెగ్యుల‌ర్‌గా తీసుకోవాలి.త‌ద్వారా ర‌క్త హీన‌త స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.

ఇక ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యంలో అంద‌రూ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే ఎండు ద్రాక్ష వాట‌ర్‌ను ప్ర‌తి రోజు తీసుకున్నా.ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!