ప్రాణాయామం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుతం ఉన్న ఉరుకులు, పరుగులు కాలంలో ప్రజలు వారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మర్చిపోయారు.

చేతికందిన ఆహారం తింటూ పనిలో బిజీగా మునిగిపోతున్నారు.ఇంతటి బిజీ లైఫ్ లో కొందరు మాత్రం వారి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు.

అలాంటివారు ప్రతిరోజు యోగాసనాలు వేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మెడిటేషన్ వంటి వాటి ద్వారా వారి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా, మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతున్నారు.

యోగాసనాలు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందని మనకు తెలుసు, కానీ ఈ యోగాలో ఉండే "ప్రాణాయామం" అనే ఆసనం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

కానీ అవి ఏంటి అనేది చాలామందికి తెలియదు.అయితే ఆ ప్రయోజనాలు ఏమిటి? ఆ ఆసనం వేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రాణాయామం అనేది యోగాసనాలలో అత్యంత ముఖ్యమైనది.ఈ ఆసనం ప్రతిరోజు చేయడం వల్ల ప్రతి రోజూ మనం ఎదుర్కొనే అధిక ఒత్తడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అంతేకాకుండా మన శరీరంలోని ఉన్నట్టువంటి ప్రతి ఒక్క నరాలు ఉత్తేజితమవుతాయి.దీనివల్ల అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

ఈ ప్రాణయామం అనే ఆసనం ప్రతి రోజూ చేయడం వల్ల మన శరీరంలోని ప్రతి ఒక్క కణానికి శక్తిని చేకూరుస్తుంది.

దీని ద్వారా రోజంతా ఎంతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతారు.ఈ ప్రాణాయామం ఆసనం ద్వారా శ్వాసక్రియ రేటు పెరగడమే కాకుండా మన శరీరంలో ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో దోహదపడుతుంది.

అంతేకాకుండా మానసికంగా ఆందోళన చెందేవారు, డిప్రెషన్ లో ఉండేవాళ్ళు ప్రతిరోజు ఈ ఆసనం చేయడం ద్వారాఅటు వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ హీరోలు…కారణం ఏంటి..?