అధిక బ‌రువు ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ తినొచ్చా..ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

అధిక బ‌రువు.ఇటీవ‌ల కాలంలో ఎంద‌రినో తీవ్రంగా వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

కొంద‌రిని శారీర‌కంగానే కాకుండా.మాన‌సికంగా కూడా ఈ స‌మ‌స్య కృంగిదీసేస్తోంది.

ఇక వెయిట్ లాస్ అయ్యేందుకు వ్యాయామాలు, ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్లు, కీటో డైట్లు, లో కేల‌రీల ఫుడ్స్ తీసుకోవ‌డం ఇలా ఎన్నో చేస్తుంటారు.

అయితే ఇదే స‌మ‌యంలో శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్లు, పిండిపదార్థాలు, కొవ్వులు, మిన‌ర‌ల్స్ వంటి విలువైన పోష‌కాలు ఉండే ఆహారాల‌ను దూరం చేసుకుంటారు.

అలాంటి వాటిలో ఆలు గ‌డ్డ (బంగాళాదుంప‌) ఒక‌టి.చాలా మంది బ‌రువు పెరిగిపోతామ‌న్న భ‌యంతో ఆలు గ‌డ్డ‌ల‌ను దూరం చేస్తుంటారు.

వాస్త‌వానికి ఆలు గడ్డ‌లో కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె, గుడ్ ఫ్యాట్స్, ఫైబ‌ర్‌, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అటువంటి ఆలు గ‌డ్డ‌ను దూరం పెడితే ఎన్నో పోష‌కాలును దూరం చేసుకున్న వాళ్లే అవుతారు.

"""/" / ఇక బంగాళాదుంప తీసుకుంటే బ‌రువు పెరుగుతారు అన్న‌ది కేవ‌లం అపోహ మాత్ర‌మే.

ప‌చ్చి బంగాళాదుంపతో ర‌సం త‌యారు చేసుకుని తీసుకుంటే.అందులో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ మ‌రియు ఫైబ‌ర్ శ‌రీరంలో కొవ్వును క‌రిగించి వెయిట్ లాస్ అయ్యేలా చేస్తాయి.

అతి ఆక‌లిని కూడా త‌గ్గేలా చేస్తాయి.అలాగే ఆలు గ‌డ్డ ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.

కాలేయం ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.అవును, ఆలు గ‌డ్డ ర‌సం ఒక డిటాక్స్ ఏజెంట్ లాగా ప‌ని చేసి.

కాలేయంలో ఉండే వేస్ట్‌ను బ‌య‌ట‌కు నెట్టేస్తుంది.ఇక బంగాళ‌దుంప ర‌సం తీసుకుంటే.

గుండె జ‌బ్బులు, ప్రాణాంత‌క వ్యాధి అయిన క్యాన్స‌ర్‌, క‌డుపు మంట, గ్యాస్‌, మ‌ధుమేహం, కిడ్నీ వ్యాధులు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది.

టీడీపీ కి గవర్నర్ పదవి ..  ఈ ముగ్గురిలో బాబు ఛాయిస్ ఎవరో ?