పెసరపప్పును అలా తింటే బరువు పెరుగుతార‌ట‌.. తెలుసా?

పెస‌ర‌ప‌ప్పు.దీని గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

పెస‌ర‌ప‌ప్పుతో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు.పెస‌ర‌ప‌ప్పుతో స్వీట్స్ కూడా త‌యారు చేస్తుంటారు.

పెస‌ర‌ప‌ప్పుతో ఏం చేసినా.అద్భుతంగా ఉంటాయి అన‌డంలో సందేహ‌మే లేదు.

అయితే రుచిలోనే కాదు.ఆరోగ్య ప్ర‌య‌జ‌నాలు అందించ‌డంలోనూ పెస‌ర‌ప‌ప్పు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యంలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ పెంచుకోవాలి అని అనుకునే వారు ఖ‌చ్చితంగా పెస‌ర‌ప‌ప్పును డైట్‌లో చేర్చుకోండి.

ఎందుకంటే, పెస‌ర‌ప‌ప్పులో విటమిన్‌ బి, విటమిన్ సి పుష్క‌లంగా ఉంటాయి.ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంపొందిస్తుంది.

త‌ద్వారా ఇన్‌ఫెక్షన్స్ ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే పెస‌ర‌ప‌ప్పులో ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి.

కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న‌వారు పెస‌ర‌ప‌ప్పు తీసుకుంటే.బ‌రువు త‌గ్గొచ్చు.

"""/" / అయితే పెస‌ర‌ప‌ప్పును అధికంగా మాత్రం తీసుకోరాదు.అలా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక పెస‌ర‌ప‌ప్పులో ఐర‌న్ కంటెంట్ కూడా పుష్క‌లంగా ఉంటుంది.అందుకే ర‌క్త‌హీన‌త ఉన్న వారు వారానికి రెండు సార్లు అయినా పెస‌ర‌ప‌ప్పును తీసుకుంటే.

ర‌క్త‌వృద్ధి జ‌రుగుతుంది.అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు కూడా పెస‌ర‌ప‌ప్పు తీసుకోవ‌చ్చు.

పెస‌ర‌ప‌ప్పు త్వ‌ర‌గా జీర్ణం అవ్వ‌డంతో పాటు.శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తుంది.

పెస‌ర‌ప‌ప్పు తీసుకోవ‌డం శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తుంది.త‌ద్వారా గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

అలాగే పెస‌ర‌ప‌ప్పులో ఉండే సోడియం.ర‌క్త‌పోటును అదుపులో ఉంచుతుంది.

అలాగే పెస‌ర‌ప‌ప్పు తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా పెరుగుప‌డుతుంది.ఇక కాల్షియం, ఫాస్పరస్ ఉండే పెస‌ర‌ప‌ప్పు ఎముకుల‌ను, కండ‌రాల‌ను, దంతాల‌ను దృఢంగా మ‌రియు బ‌లంగా మారుస్తుంది.

కాబ‌ట్టి, ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర్చే పెస‌ర‌ప‌ప్పును డైట్‌లో చేర్చుకోండి.కానీ, అతిగా మాత్రం తీసుకోకండి.

త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. దుర్గమ్మ సన్నిధిలో ప్రభాస్ పెద్దమ్మ కామెంట్!