మ‌ధుమేహులకు వ‌రం ఈ పండు.. డైట్ లో ఉంటే లాభాలే లాభాలు!

సాధార‌ణంగా మ‌ధుమేహం( Diabetes ) ఉన్న‌వారు పండ్లు తినడానికి సంకోచిస్తుంటారు ఎందుకంటే ఫ్రూట్స్ షుగర్‌ లెవెల్స్ ను పెంచుతాయి.

అయితే ఇది అన్ని పండ్లకు వర్తించదు.నిజానికి కొన్ని రకాల పండ్లు మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.

ఈ జాబితాలో పియర్ ఫ్రూట్ ( Pear Fruit )కూడా ఒకటి.మధుమేహులకు ఈ పండు ఒక వరం అనే చెప్పుకోవచ్చు.

పియ‌ర్‌ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

పియ‌ర్ ఫ్రూట్ ను బేరి( Beri ) అని కూడా పిలుస్తారు.ఈ పండు చూడ‌టానికి ఆక‌ర్ష‌ణీయంగానే కాదు.

తిన‌డానికి తియ్య‌గా రుచిగా కూడా ఉంటుంది.పియ‌ర్ ఫ్రూట్ విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

మ‌ధుమేహం ఉన్న‌వారు ఎటువంటి భ‌యం లేకుండా పియ‌ర్ ఫ్రూట్ ను తినొచ్చు.పియ‌ర్ ఫ్రూట్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డానికి సహాయపడే అనేక లక్షణాలు ప్రియ‌ర్ ఫ్రూట్ లో ఉంటాయి.

అందువ‌ల్ల ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక అవుతుంది. """/" / పియ‌ర్ ఫ్రూట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ టైప్ 2 డయాబెటిస్ ( Flavonoids Type 2 Diabetes )వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అలాగే జీర్ణ ఆరోగ్యానికి పియ‌ర్ ఫ్రూట్ చాలా మంచిది.పియ‌ర్ పండులో పుష్క‌లంగా ఉండే ఫైబ‌ర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

తక్కువ కేలరీలు, నీరు మరియు ఫైబర్ అధికంగా ఉండటం వ‌ల్ల వెయిట్ లాస్ అవ్వాల‌ని భావిస్తున్న‌వారు పియ‌ర్ ఫ్రూట్ ను రెగ్యుల‌ర్ గా తినొచ్చు.

త‌ద్వారా మ‌రింత వేగంగా బ‌రువు త‌గ్గుతాయి. """/" / అంతేకాదు డైట్ లో పియ‌ర్ ఫ్రూట్ ను చేర్చుకోవ‌డం వ‌ల్ల అధిక రక్తపోటు స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.

రోగనిరోధక వ్య‌వ‌స్థ బలోపేతం అవుతుంది.ఇన్‌ఫెక్షన్లు, టాక్సిన్స్ మరియు ఇతర వ్యాధికారకాలు మీకు దూరంగా ఉంటాయి.

మ‌రియు గుండె ఆరోగ్యం సైతం మెరుగుప‌డుతుంది.

ఏపీ క్యాబినెట్ సమావేశం… కీలక నిర్ణయాలు ఇవే