పంచ‌దార‌ బదులు పటిక బెల్లం వాడితే ఈ సూప‌ర్ బెనిఫిట్స్ మీవే!

పంచ‌దార.నిత్యం వాడే ఆహార ప‌దార్థాల్లో ఇదీ ఒక‌టి.

ముఖ్యంగా టీ, కాఫీల్లో పంచ‌దార లేకుండా తాగ‌నే తాగ‌లేరు.ఇక పిండి వంటలు, ఇతరత్రా తీపి రుచుల కోసం ఎక్కువ‌గా పంచదార‌నే ఉప‌యోగిస్తుంటారు.

అయితే పంచ‌దార వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అంద‌క‌ పోగా.అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంది.

అయితే పంచ‌దార బ‌దులుగా ప‌టిక బెల్లంను ఉప‌యోగిస్తే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక ప‌టిక బెల్లంను ఉప‌యోగించ‌డం వ‌ల్ల బోలెడన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా పొందొచ్చ‌ట‌.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్ర‌స్తుత వ‌ర్షాకాలం, క‌రోనా కాలం కావ‌డంతో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.

అలాంటి వారికి ప‌టిక బెల్లం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని పాల‌లో ప‌టిక బెల్లం క‌లిపి ఉద‌యం సాయంత్రం తీసుకోవాలి.

ఇలా చేయ‌డం జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.అలాగే భోజనం చేసిన త‌ర్వాత ప‌టిక బెల్లం తీసుకుంటే.

ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వ‌డంతో పాటు గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

చిన్న పిల్ల‌ల‌కు పాల‌లో పంచదార బ‌దులుగా ప‌టిక బెల్లం క‌లిపి ఇస్తే చాలా మంచిది.

మ‌రియు పాలిచ్చే త‌ల్లులు ప‌టిక బెల్లం తీసుకోవ‌డం వ‌ల్ల బలహీనతని తగ్గించ‌డంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుతుంది.

అదేవిధంగా, నోటి పూతతో బాధ‌ప‌డేవారికి ప‌టిక బెల్లం బెస్ట్ అప్ష‌న్‌.పటిక బెల్లం, మ‌రియు ఏలకులతో క‌లిపి పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ప్ర‌తి రోజు ఉద‌యం నీటిలో క‌లిసి తీసుకుంటే నోటి పూత త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే పంచ‌దార‌కు బ‌దులుగా ప‌టిక బెల్లం తీసుకోవ‌డం హిమోగ్లోబిన్ స్థాయి పెంచి ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

మ‌రియు అల‌స‌ట, నీర‌సం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!