ఉల్లి, తేనె క‌లిపి తీసుకుంటే.. ఆ జ‌బ్బులు దూరం!

ఉల్లిపాయ‌, తేనె రెండూ విడి విడిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.నిత్యం వాడే ఈ రెండిటిలోనూ ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అయితే విడి విడిగానే కాదు.ఉల్లిపాయ మ‌రియు తేనె క‌లిపి తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి ఉల్లి, తేనె క‌లిపి ఎలా తీసుకోవాలి.క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ‌‌ను శుభ్రం చేసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఆ త‌ర్వాత ఉల్లి ర‌సంలో తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.ముఖ్యంగా ఈ వింట‌ర్ సీజ‌న్‌లో వ‌చ్చే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, వైర‌ల్ ఫీవ‌ర్‌ వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో ఉల్లి, తేనె కాంబినేష‌న్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అలాగే శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును క‌రిగించ‌డంలో ఉల్లి, తేనె మిశ్ర‌మం ఉప‌యోగ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారు, వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారు ప్ర‌తి రోజు ఉల్లిర‌సంలో తేనె మిక్స్ చేసి.

రెండు స్పూన్ల చప్పును ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే మంచిది. """/"/ విరేచనాల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డే వారు ఉల్లి ర‌సం తేనె క‌లిపి తీసుకుంటే.

ఆ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌న‌మం పొందుతారు.అలాగే ఉల్లి, తేనె కాంబినేష‌న్ రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో ఉండే సల్ఫర్ కంటెంట్ క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించడంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఇక ఉల్లి ర‌సంతో తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బరం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

అలాగే మ‌ధుమేహం వ్యాధితో బాధ ప‌డుతున్న వారు ఉల్లి ర‌సంలో తేనె క‌లుపుకుని ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

ఉల్లి ర‌సం, తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల దంత మ‌రియు చిగుళ్ల‌ స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా ఉంటాయి.

విద్యార్ధి వీసాలకే మా తొలి ప్రాధాన్యత : భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి