పొట్ట తగ్గించే అద్భుతమైన చిట్కా ఉల్లిరసం..!

ఆరోగ్యాన్ని అందించే కూరగాయలలో ఉల్లిపాయ ఒకటి.ఈ ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్.

అలాంటి ఈ ఉల్లిపాయ పొట్ట తగ్గించవచ్చు అని మీకు తెలుసా? ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి నోటికి అందిన ఆహారాన్ని తిని, ఎటువంటి వ్యాయామం లేకుండా ఇంట్లోనే పని చెయ్యడం వల్ల పొట్ట లేని వారికి కూడా పొట్ట వచ్చేసి ఉంటుంది.

కానీ ఇప్పుడు అన్లాక్ మొదలైంది.పొట్ట ఉంటే పని చెయ్యడం కష్టమే కాదు చూడటానికి వికారంగా ఉంటుంది.

అలాంటి వారు పొట్ట తగ్గించుకుని అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఉల్లి చిట్కా గురించి తెలుసుకోవాల్సిందే.

ఆ చిట్కా ఏంటి ? ఎలా పాటిస్తే పొట్ట తగ్గుతుందనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

ఉల్లిపాయలో వివిధ రకాలైన విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం ఉన్నాయి.ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతాయి.

అలాంటి ఈ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి దానిని వడపోసి రసం తీసుకోవాలి.

ఆ రసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగాలి.ఇలా తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మనకు పొట్ట సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

అంతేకాదు.ఈ ఉల్లిపాయ వల్ల గుండె సమస్యలు, తలనొప్పి, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

ఉల్లిపాయలో విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఇమ్మ్యూనిటీ పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

ఉల్లిపాయ వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది.ఇన్ని ప్రయోజనాలను ఉల్లిపాయ అందిస్తుంది కాబట్టి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని పెద్దలు చెప్తుంటారు.

వీడియో: యూఎస్‌లో షాకింగ్ ఘటన.. ఫిమేల్ టీచర్‌ను కొట్టిన స్టూడెంట్..