బ‌రువు త‌గ్గాలా..అయితే ఓట్ మిల్క్ తాగాల్సిందే!

నేటి కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

డైటింగ్లు పాటిస్తూ, వ‌ర్కౌట్లు చేస్తూ ఒంట్లో కొవ్వును క‌రిగించుకునేందుకు నానా పాట్లు ప‌డుతున్నారు.

కొంద‌రేమో తిన‌డం మానేసి మ‌రీ బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటారు.దీని వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత తీవ్రం అవుతుంది.

వాస్త‌వానికి కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవ‌డం ద్వారా కూడా బ‌రువు త‌గ్గొచ్చు.అలాంటి వాటిలో ఓట్ మిల్క్ ఒక‌టి.

ఓట్ మిల్క్ ను రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ద్వారా త‌యారు చేస్తారు.

ఓట్ మిల్క్‌లో పోష‌కాలు ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.అవు పాలు, గేదె పాల‌కు ప్రత్యామ్నాయంగా ఈ ఓట్ మిల్క్ వాడ‌వ‌చ్చు.

ఓట్ మిల్క్ ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.

ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు ప్ర‌తి రోజు ఒక గ్లాస్ ఓట్ మిల్క్ తీసుకుంటే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.

దాంతో వెయిట్ లాస్ అవుతాయి. """/"/ అలాగే ఓట్ మిల్క్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముక‌ల‌ను, దంతాల‌ను దృఢంగా మారుస్తాయి.

బోన్ ఫ్రాక్చర్ వంటి సమస్యలు ఉన్న వారు ఓట్ మిల్క్ తీసుకుంటే చాలా మంచిది.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు కూడా ఓట్ మిల్క్ ఎంతో మంచిది.ఓట్ మిల్క్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌ర‌చ‌డంలోనూ ఓట్ మిల్క్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అందు వ‌ల్ల‌, ఓట్ మిల్క్ ను తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్ అవుతుంది.

పిల్ల‌ల‌కు కూడా ఓట్ మిల్క్ మంచిదే.అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌న్నీ పొందాలంటే ఇంట్లో త‌యారు చేసుకున్న ఓట్ మిల్క్‌నే తీసుకోవాలి.

బ‌య‌ట మార్కెట్‌లో దొరికే ఓట్ మిల్క్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.‌.

అట్లాంటిక్ సముద్రం కింద 93 రోజులు గడిపిన వ్యక్తి.. వయసు తగ్గాడుగా..?