జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

జాజికాయను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తున్నాం.జాజికాయ వంటలకు రుచిని కలిగిస్తుంది.

అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.జాజికాయను నేతిలో వేగించి పొడి చేసుకొని ఉంచుకోవాలి.

5 గ్రాముల పొడిని ఆవుపాలతో కలిపి తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

అయితే జాజికాయను మోతాదు ప్రకారం మాత్రమే తీసుకోవాలి.తాంబూలం వేసుకొనేటప్పుడు చిటికెడు జాజికాయ పొడి వేసుకొంటే నోటి దుర్వాసనతో పాటు పంటి మీద నలుపునూ, గార తొలగిపోయి పళ్ళు మిలమిల మెరుస్తాయి.

దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడిని వేసుకొని త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

జాజికాయలో ‘మిరిస్టిసిన్’ అనే పదార్ధం ఉండుట వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది.అందువల్ల అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి దివ్య ఔషధంగా చెప్పవచ్చు.

రెగ్యులర్ గా ఈ పొడిని తీసుకుంటూ ఉంటే అల్జీమర్స్ వ్యాధి తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉన్నాయి.

జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచ‌డం కోసం కూడా చాలా బాగా సహాయపడుతుంది.

కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి.

దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి.ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతిగా మారటమే కాకుండా చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

Anaparthi TDP : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ నిరసన