వేప‌గింజ‌ల‌తో ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసా?

వేపచెట్టు నుంచి వ‌చ్చే వేప ఆకులు, వేప చిగురు, వేప బెర‌డు, వేప పువ్వులు ఇలా అన్నీ మాన‌వుడికి ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఎన్నో జ‌బ్బుల‌ను కూడా నివారిస్తాయి.పూర్వ కాలం నుంచి మ‌న పూర్వీకులు వేప‌ను ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తున్నారు.

అలాగే వేప గింజ‌లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వేప గింజ‌ల‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే.

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. """/" / సాధార‌ణంగా వేప గింజ‌ల‌తో నూనెను త‌యారు చేస్తుంటారు.

వేప నూనె కూడా ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక వేప గింజ‌లను పొడి చేసి.

పాల‌లో క‌లిపి తీసుకుంటే అనేక బెనిఫిట్స్ పొందొచ్చు.ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

త‌ద్వారా ర‌క‌ర‌కాల వైర‌స్‌లు ద‌రిచేర‌కుండా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.మ‌ధుమేహం ఉన్న వారికి కూడా వేప గింజ‌లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

"""/" / వేప గింజ‌లను పొడి చేసి అప్పుడ‌ప్పుడు తీసుకుంటే.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.

అలాగే వేప గింజ‌ల‌ను అప్పుడుప్పుడు తీసుకోవ‌డం వ‌ల్ల‌ కడుపులో నులి పురుగుల‌ను నిర్మూలించి.

క‌డుపు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.ఇక వేప గింజ‌లు నేచురల్ బర్త్ కంట్రోల్ గా ప‌ని చేస్తాయి.

కాబ‌ట్టి, వేప గింజ‌ల‌ను తీసుకుంటే.అవాంఛిత గర్భంను నివారించుకోవచ్చు.

"""/" / అయితే ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు మాత్రం వేప గింజ‌ల‌కు దూరంగా ఉండాలి.

గ‌ర్భ‌వ‌తులు వేప గింజ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల వారికి హాని క‌లిగించి.మిస్ క్యారీ అయ్యేలా చేస్తాయి.

ఇక సౌంద‌ర్య ప‌రంగా కూడా వేప గింజ‌లను బాగా యూజ్ చేసుకోవ‌చ్చు.మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు వేప గింజ‌ల పొడిలో కొద్దిగా నీరు క‌లిపి అప్లై చేయాలి.

ఇలా చేస్తే క్ర‌మంగా మొటిమ‌లతో పాటు న‌ల్ల మ‌చ్చ‌లు కూడా త‌గ్గిపోతాయి.

నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు..: మంత్రి కోమటిరెడ్డి