మష్రూమ్ సూప్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
TeluguStop.com
వర్షాకాలంలో విరి విరిగా లభించే వాటిల్లో మష్రూమ్స్ (పుట్టగొడుగులు) ముందు వరుసలో ఉంటాయి.
ప్రోటీన్, రాగి, కాల్షియం, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి, ఫైబర్ ఇలా మష్రూమ్స్‌లో అనేక పోషక విలువలు నిండి ఉంటాయి.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి.
అయితే చాలా మంది మష్రూమ్‌తో తయారు చేసిన కర్రీలను ఇష్టపడరు.అలాంటి వారు సూప్ రూపంలో తీసుకోవచ్చు.
పైగా మష్రూమ్ సూప్‌ను డైట్‌లో చేర్చుకుంటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.
మరి ఆ బెనిఫిట్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.మధుమేహం వ్యాధి గ్రస్తులు షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు.
అయితే అలాంటి వారు తరచూ మష్రూమ్ సూప్ తీసుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటే, ఈ సూప్ తాగడం వల్ల.
అందులో ఉండే పలు పోషకాలు చక్కర స్థాయిలను సమర్థవంతంగా అదుపు చేస్తాయి. """/" /
రక్తహీనతను నివారించడంలోనూ మష్రూమ్ సూప్ ఉపయోగపడుతుంది.
డైట్‌లో మష్రూమ్ సూప్ ను తీసుకోవడం వల్ల రక్త వృద్ధి జరుగుతుంది.దాంతో రక్త హీనత తగ్గుముఖం పడుతుంది.
అలాగే ప్రతి రోజు మష్రూమ్ సూప్ తీసుకుంటే గనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దాంతో సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.మష్రూమ్స్‌లో కాల్షియంతో పాటుగా విటమిన్ డి కూడా ఉంటుంది.
అందు వల్ల, వీటితో తయారు చేసిన సూప్ ను తరచూ తీసుకుంటే ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా మారతాయి.
ఇక మష్రూమ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.కాబట్టి, మష్రూమ్ సూప్‌ను తీసుకుంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.
నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!