చలికాలంలో పుదీనా ఎన్ని విధాలుగా సహాయపడుతుందో తెలుసా?
TeluguStop.com
ఆకుకురల్లో ఒకటైన `పుదీనా`ను రకరకాల వంటల్లోల్లో తరచూ వాడుతూనే ఉంటారు.ఘుమఘుమలాడే పుదీనా వంటలకు అద్భుతమైన రుచి, చక్కని సువాన అందించడంలో ముందుంటుంది.
ఆరోగ్యానికి కూడా పుదీనా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ చలి కాలంలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉండే పుదీనా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
మరి అవేంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా వింటర్ సీజన్ ప్రారంభం అయ్యిందంటే రోగాలు కూడా స్టాట్ అవుతాయి.
అయితే ఈ చలి కాలంలో చాలా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
అలాంటి వారికి పుదీనా గ్రేట్‌గా సహాయపడుతుంది.నీటిలో పుదీనా ఆకులు వేసి మరిగించి.
ఆవిరి పడితే జలుబు సమస్య దూరం అవుతాయి.అలాగే దగ్గు సమస్య ఉన్న పుదీనా ఆకులతో తయారు చేసిన టీ తాగితే.
మంచి ఉపశమనం లభిస్తుంది.పుదీనా ఆకులను మరిగించిన నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు తగ్గిపోతుంది.
"""/"/
ఇక తరచూ పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అలాగే ప్రతి రోజు పుదీనా ఆకులతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల.
అందులో ఉండే విటమిన్ సి, విటమిన్ డీ, విటమిన్ బి లు మరియు ఇతర పోషకాలు శరీర రోగ నిరోధక శక్తి పెంచి జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది.
అదేవిధంగా, నిత్యం పుదీనాను ఏదో ఒక రూపంలో తీసుకుంటే.జీర్ణ శక్తి పెరుగుతుంది.
మరియు అధిక బరువు అదుపులోకి వస్తుంది.అలాగే ఈ చలి కాలంలో చాలా మంది పొడి చర్మంతో ఇబ్బంది పడుతుంటారు.
ఎన్ని క్రీములు, లోషన్లు వాడినా ప్రయోజనం ఉండదు.అలాంటి పుదీనా రసంలో కొద్దిగా తేనె మిక్స్ చర్మానికి పట్టించాలి.
అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మం క్రమంగా మృదుగా మారుతుంది.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?