పిల్ల‌ల‌కు కిడ్నీ బీన్స్ ఖ‌చ్చితంగా పెట్టాల‌ట‌.. ఎందుకంటారా?

బీన్స్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే.అయితే వాటిల్లో కిడ్నీ బీన్స్ ఒక‌టి.

చాలా మంది వీటిని రాజ్మా అని కూడా పిలుస్తుంటారు.కిడ్నీ బీన్స్‌లో ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి, విట‌మిన్ కె, విట‌మిన్ ఇ, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌తో స‌హా ఇంకెన్నో పోష‌క విలువ‌లు సైతం నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా ఇవి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి అయితే ఎదిగే పిల్ల‌ల‌కు ఖ‌చ్చితంగా పెట్టాల్సిన ఆహారాల్లో కిడ్నీ బీన్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

అవును, కిడ్నీ బీన్స్‌ను త‌ర‌చూ ఏదో ఒక రూపంలో పిల్ల‌ల చేత తినిపించాలి.

ఎందుకంటారా.? అక్క‌డికే వ‌స్తున్నా.

ఆగండీ.ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది పిల్ల‌లు ప్రోటీన్ లోపంతో బాధ ప‌డుతున్నారు.

ఈ లోపం వ‌ల్ల చిన్నారుల ఎదుగుద‌ల తీవ్రంగా దెబ్బ తింటుంది.అయితే కిడ్నీ బీన్స్‌లో ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.

అందు వ‌ల్ల‌, వారంలో రెండు మూడు సార్లు పిల్ల‌ల‌తో కిడ్నీ బీన్స్‌ను తినిపిస్తే ప్రోటీన్ లోపం ద‌రి చేర‌కుండా ఉంటుంది.

"""/"/ అలాగే ఎప్పుడూ నీర‌సంగా, మూడీగా ఉండే పిల్ల‌ల‌కు కిడ్నీ బీన్స్‌ను త‌ప్ప‌ని స‌రిగా పెట్టాలి.

త‌ద్వారా వారి శరీరానికి మంచి శక్తి ల‌భిస్తుంది.కండర నిర్మాణం కూడా బాగుంటుంది.

దాంతో వారు ఎల్ల‌ప్పుడూ హుషారుగా ఉంటారు.పిల్ల‌ల్లో కామ‌న్‌గా క‌నిపించే స‌మ‌స్య ఎముక‌ల బ‌ల‌హీన‌త‌.

అయితే కిడ్నీ బీన్స్‌ను చిన్నారులకు పెట్ట‌డం వ‌ల్ల.అందులో ఉండే కాల్షియం, జింక్ వంటి పోష‌కాలు ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి.

అంతే కాదు, పిల్ల‌ల‌కు కిడ్నీ బీన్స్‌ను పెట్ట‌డం వ‌ల్ల.వారి మెద‌డు షార్ప్‌గా ప‌ని చేస్తుంది.

వారిలో మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.బాడీ వెయిట్ అదుపు త‌ప్ప‌కుండా ఉంటుంది.

మ‌రియు ర‌క్త‌హీన‌త బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు.

చిరంజీవి కి భారీ సక్సెస్ ఇవ్వడం శ్రీకాంత్ ఓదెల వల్ల అవుతుందా..?