ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే జున్ను.. మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా!

ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కాల్షియం లోపం క‌నిపిస్తోంది.

కాల్షియం లోపించ‌డం వల్ల ఎముకలు బ‌ల‌హీనంగా మారిపోతుంటాయి.క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి.

అయితే ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండాలంటే ఎముక‌లు దృఢంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం.ముఖ్యంగా ఏ ప‌నైనా చేయాలంటే.

మ‌న ఎముక‌లు స‌క్ర‌మంగా ఉండాలి.ఎందుకంటే, మ‌న శ‌రీనాకి ఎముక‌లే ఆధారం.

అయితే ఎప్పుడైతే ఎముక‌లు పెళుసుబారతాయో.మ‌నం అనారోగ్యం బారిన ప‌డిన‌ట్టే.

అందుకే మ‌న డైట్‌లో ఎముక‌ల‌ను దృఢ‌ప‌రిచే ఆహారాన్ని ఖ‌చ్చితంగా చేర్చుకోవాలి.ఎముక‌ల‌ను బ‌లంగా మార్చ‌డంలో కాల్షియం, విటమిన్‌- డి ముఖ్య పాత్ర పోషిస్తాయి.

కాబ‌ట్టి, ఇవి పుష్క‌లంగా ఉండే ఆహ‌రం ప్ర‌తి రోజు తీసుకోవాలి.అయితే ఎంతో రుచిగా ఉండే జున్ను ఎముక‌ల ఆరోగ్యానికి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

జున్నులో క్యాల్షియం, విట‌మిన్ డి, విట‌మిన్ కె సమృద్ధిగా ఉంటాయి.కాబ‌ట్టి, జున్ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లే కాదు దంతాలు, కండ‌రాలు కూడా ప‌టిష్టంగా మార‌తాయి.

"""/" / ఇక జున్నుతో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.జున్నును డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే ఫైబర్.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం చేయ‌డంతో పాటు జీర్ణ శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది.అలాగే జున్నులో ఎసిటేట్‌, ప్రొపియనేట్లు ఉంటాయి.

ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి.జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.

జున్ను తిన‌డం వ‌ల్ల మ‌రో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నం ఏంటంటే.గుండె పోటు ఇత‌ర గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ట‌.

అలాగే ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటే జున్నును రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో తీసుకుంటే.శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి అందండంతో పాటు రోజంతా యాక్టివ్‌గా ఉంటార‌ట‌.

కాబ‌ట్టి, జున్నును అస్స‌ల‌ నిర్ల‌క్ష్యం చేయ‌కుండా.ప్ర‌తి రోజు త‌క్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

నాగచైతన్య తండేల్ మూవీకి టికెట్ రేట్ల పెంపు ఉంటుందా.. క్లారిటీ ఇదేనంటూ?