బెల్లం, మిరియాలు క‌లిపి తీసుకుంటే ఆ జ‌బ్బుల‌న్నీ ప‌రార్‌!

బెల్లం ఎంత తియ్య‌గా ఉంటుందో.మిరియాలు అంత ఘాటుగా ఉంటాయి.

ప్ర‌త్యేక‌మైన రుచిని క‌లిగి ఉండే ఈ రెండూ విడి విడిగా ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా ఇవి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అయితే విడి విడిగా కాకుండా బెల్లం, మిరియాలు క‌లిపి తీసుకుంటే మ‌రిన్నో లాభాల‌ను పొందొచ్చు.

అనేక జ‌బ్బుల‌నూ నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బెల్లం, మిరియాలు క‌లిపి ఎలా తీసుకోవాలి.

? ఎప్పుడు తీసుకోవాలి.? అస‌లు ఈ రెండిటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఏంటీ.

? వంటి విష‌యాలు ఇప్ప‌డు తెలుసుకుందాం.ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో స్పూన్ బెల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి వేసి క‌లిపి సేవించాలి.

లేదా ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిలో కొద్దిగా మిరియాల పొడిని మిక్స్ చేసి ఉండలా చేసుకుని తిన‌వ‌చ్చు.

ఇలా ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.ముఖ్యంగా ప్ర‌స్తుత శీతాకాలంలో బెల్లం, మిరియాల‌ను క‌లిపి తీసుకుంటే చ‌లిని త‌ట్టుకునే శ‌క్తి ల‌భిస్తుంది.

అదే స‌మ‌యంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారి.జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/" / అలాగే మోకాళ్ల నొప్పుల‌తో ఇబ్బంది ప‌డే వారు ప్ర‌తి రోజు బెల్లం, మిరియాల‌ను క‌లిపి తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.

దాంతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.నిత్యం ఎసిడిటీ, గ్యాస్, మ‌ల‌బ‌ద్ధకం, క‌డుపు నొప్పి, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధప‌డే వారికి బెల్లం, మిరియాల‌ను పైన చెప్పిన విధంగా క‌లిపి తీసుకోవాలి.

త‌ద్వారా జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.ఫ‌లితంగా ఆయా జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అంతే కాదు, బెల్లం, మిరియాల‌ను క‌లిపి తీసుకుంటే ర‌క్త హీన‌త పరార్ అవుతుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.మ‌రియు మూత్ర పిండ సంబంధిత వ్యాధులు సైతం త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్..!!